- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
90 ఏళ్ల వయసులో స్కైడైవ్ చేసిన బామ్మ
దిశ, వెబ్‌డెస్క్ : కొందరికి వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే.. అని నిరూపిస్తుంటారు. వృద్ధాప్య చాయలు తమ ఒంటికి చేరవని, ఎప్పటికీ తాము యువకుల్లాగా సాహసాలు చేయడానికి రెడీగా ఉంటామని, మాటలతో కాదు.. చేతలతో చేసి చూపిస్తారు. ఇంగ్లాండ్‌కు చెందిన మహిళ పాట్రిసియా బేకర్ కూడా ఆ కోవలోకే వస్తారు. తన 90వ పుట్టినరోజు సందర్భంగా ఈ బామ్మ స్కై డైవ్ చేసి ఔరా అనిపించడం విశేషం.
స్కైడైవింగ్ చేయడానికి యువకులే జంకుతారు. అలాంటిది 90 ఏళ్ల గ్రానీ.. అలవోకగా దూకేసి అభినందనలు అందుకుంటోంది. పుట్టినరోజులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ.. తన 90వ పుట్టినరోజును ఎప్పటికీ గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది బేకర్. పైగా తాను మరణించే లోపు.. ఒక్కసారైనా స్కై డైవింగ్ పూర్తి చేయాలనుకుంది. తన కోరిక నెరవేర్చుకోవడమే కాకుండా, దానికి సమాజసేవను కూడా జత చేసింది ఈ బామ్మ. స్కై డైవింగ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుల్ని రెండు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించింది.
ఇక బేకర్‌ను తన ఫ్యామిలీ డాక్టర్ స్కై డైవ్ చేయద్దని వారించినా.. ఆయన మాట వినకుండా సాహసానికి సిద్ధపడింది. డ్రైవర్ సాయంతో 15వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఈ గ్రానీ సాహసం నిజంగా అభినందనీయం. ఈ బామ్మ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆమె ఫీట్‌కు సలామ్ కొడుతున్నారు. ఈ వయసులో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అభినందిస్తున్నారు.
‘నేను ప్రతిరోజు 50 సిట్-అప్ చేస్తాను. దీని వల్లే.. వయసు మీద పడుతున్న యాక్టివ్‌గా ఉంటున్నాను. అంతేకాదు, నాకు సాహసాలంటే భయం లేదు. ఎంతో ఉత్సాహంగా వాటిని చేయడానికి ముందుకొస్తాను. గతంలో హాట్ ఎయిర్ బెలూన్, పారా గ్లైడింగ్ చేశాను’ అని బేకర్ తెలిపింది.