పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

by Shyam |
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
X

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం సస్పెండ్ చేశారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడం, పంచాయతీ చెక్కులను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రాయడంతో పాటు, పంచాయతీ సిబ్బంది వేతనాల్లో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు ఎంపీడీవో అనంతరావు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఆ ఆరోపణలన్నీ వాస్తవం అని తేలడంతో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed