- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ కార్యదక్షతతోనే సాధ్యం అయ్యింది !
by Shyam |

X
దిశ, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ పాలన వల్లే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధాన్యం పంపే స్థాయికి ఎదిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం కౌకుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి గోదాం నుండి తమిళనాడుకు గూడ్స్ రైలు ద్వారా ధాన్యం పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు రైల్వే అధికారి వెంకన్న జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌకుంట్లలో ఇంత పెద్ద గోదాం ఉండడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు. పాలమూరు జిల్లా నుంచి ఈరోజు వేరే రాష్టాలకు బియ్యంను సరఫరా చేస్తున్నామంటే కేసీఆర్ కార్యదక్షతతోనే సాధ్యం అయ్యిందన్నారు.
Next Story