రైతులకు బాధపడొద్దు..ప్రభుత్వం ఆదుకుంటుంది

by Shyam |
రైతులకు బాధపడొద్దు..ప్రభుత్వం ఆదుకుంటుంది
X

దిశ, మెదక్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు అన్నారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి, పంటలకు కావలసిన విత్తనాలు, ఎరువులు , పురుగు మందులు తదితర సమస్యలన్నింటికి అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు తమ సమస్యలకు నెంబర్ 08455-276466, 797725269 లకు సంప్రదించాలని కోరారు. కంట్రోల్ రూమ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని తెలిపారు. కూరగాయలు పండించే రైతులు తమ పంటలను పొలాల్లో వదిలి వెళ్లకూడదన్నారు.త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. కూరగాయల అమ్మకం, తరలింపు , రవాణా, పాసులు, ఎరువులు , విత్తనాలు , పురుగుల మందులు తదితర ఏ సమస్యలున్నా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి తమ సహాయ సహకారాలు అందిస్తారన్నారు.

మాస్క్ ధరించకుంటే జరిమానా.. ప్రజలు మాస్క్ లేకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ ఎం . హనుమంతరావు హెచ్చరించారు . కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు . ప్రస్తుత పరిస్థితుల్లో తమను తాము కాపాడుకుంటూ . . తమ కుటుంబాన్ని , సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు . కంటైన్మెంట్ జోన్లో ఎవరైనా బయట కనిపిస్తే ప్రభుత్వ క్వారెంటైన్ భవనాలకు తరలిస్తామని కలెక్టర్ స్పష్టం చేసారు . అత్యవసరమై బయటకు వెళ్ళినపుడు విధిగా మాస్క్ లేదా చేతి రుమాలు ( దస్తీ ) తో నోరు , ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా కట్టుకుని వెళ్లాలని కోరారు . ప్రజలు వ్యక్తిగత దూరం పాటించడంతో పాటు స్వీయ నియంత్రణ పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

Tags: carona, lockdown, rain, damage crops, collecter hanmanta rao, govt help formers

Advertisement

Next Story

Most Viewed