- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెయిర్న్ ఎనర్జీకి పన్ను రిఫండ్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం!
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో కెయిర్న్ ఎనర్జీ, భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇటీవలే కెయిర్న్ ఎనర్జీ సంస్థ పన్ను రిఫండ్లను చెల్లిస్తే కేసులను ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించింది. తాజాగా కెయిర్న్ సంస్థతో రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాన్ని పరిష్కరిస్తూ కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను స్వాగతిస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే ఒప్పందం ప్రకారం ముందుగా కెయిర్న్ ఎనర్జీ సంస్థ భారత్‌పై అంతర్జాతీయ కోర్టుల్లో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఆ తర్వాత రూ.7,900 కోట్ల పన్ను రిఫండ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కెయిర్న్ ఎనర్జీ సంస్థ కేసులను ఉపసంహరించుకునేందుకు కనీసం 3-4 వారాల సమయం పడుతుందని, ఆ తర్వాతే భారత ప్రభుత్వం పన్ను రిఫండ్ ప్రక్రియను చేపడుతుందని తెలిపారు. దీనికి సంబంధించి కెయిర్న్ ఎనర్జీ కంపెనీ ఇంకా స్పందించలేదు.