- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యావిధానంపై వారితో.. ఏపీ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. రోజూ రెండువేలకు పైగా కేసులు నమోదు అవుతూ, రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కాగా ఈ వైరస్ మూలంగా ఇప్పటికే విద్యా విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నారు. పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో, పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ, ఉత్తీర్ణులను చేస్తున్నాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అనుసరించాల్సిన విధానంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 20 యూనివర్సిటీల ఉపకులపతులతో రాజభవన్ నుంచి గవర్నర్ విశ్వభూషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ 19 మూలంగా ‘ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ళు – నివారణ మార్గాలు’ అనే అంశంపై చర్చించారు. కరోనా కేసులు పెరుగుతుండడం, రెగ్యులర్ తరగతులు నిర్వహించలేకపోవడం, యూజీసీ ఆదేశాల మేరకు తుది సంవత్సర పరీక్షలు నిర్వహణకు అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించారు. ఇకపై విద్యాసంవత్సరం ఎలా ముందుకు తీసుకు వెళ్లడంపై గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె హెమచంద్రారెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలు పాల్గొన్నారు.