పీవీ సింధుకు గవర్నర్ బీబీ హరిచందన్ అభినందనలు

by srinivas |
pv-sindu
X

దిశ, ఏపీ బ్యూరో : టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి.. వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించగా గవర్నర్ తన అభినందనలు తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు, తాజా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి భారత దేశానికి గుర్తింపు తీసుకు వచ్చారని గవర్నర్ ప్రశంసించారు. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించారని గవర్నర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ బీబీ హరిచందన్ ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed