విమర్శలొద్దు.. కలిసి పోరాడుదాం: హరీశ్‌రావు

by Shyam |
విమర్శలొద్దు.. కలిసి పోరాడుదాం: హరీశ్‌రావు
X

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషి చేస్తుందని, ప్రజలంతా సహకరించాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్వీఎం ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం గల కోవిడ్ బ్లాక్, ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భయం, నిర్లక్ష్యం రెండూ వద్దు.. వ్యాధి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు అన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవరమైతే తప్ప అడుగు బయటపెట్టొద్దని సూచించారు. సామూహిక కార్యక్రమాలను నిర్వహించవద్దన్నారు. కోవిడ్ మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులకు సముచిత గౌరవం ఇవ్వాలన్నారు. త్వరలో ఆర్వీఏం ఆసుపత్రి, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుచేసుకోనున్నామన్నారు. ఓకె రోజు 600 మందికి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ బాధితులకు అన్నీ విధాలుగా ప్రభుత్వ అండగా ఉంటుందన్నారు. క్లిష్ట సమయంలో… విమర్శలు వద్దు.. కలిసి కట్టుగా మహమ్మారిపై పోరాటం చేద్దామన్నారు. మంత్రి వెంట మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, వైద్యాధికారి కాశీనాథ్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story