- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవో ప్రకారం గ్రాంట్ వేతనం అమలు చేయాలి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అర్చక ఉద్యోగులకు జీవో నెంబర్ 577 ప్రకారం గ్రాంటు వేతనం అమలు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి కోరింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ను కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న 2625 మంది అర్చక ఉద్యోగులకు 2014 జూన్ 2 కు లోబడి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు రావడం లేదన్నారు. జీవో నెంబర్ 577 జారీ చేసి సుమారు రెండు సంవత్సరాలు దాటినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం అందరిని కలచివేస్తోందని అన్నారు. మనోవేదనకు గురై కొందరు అర్చకులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించి అర్చక ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దేవాలయాల నుండి పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జీవో నెంబర్ 261 ప్రకారం పదోన్నతులు కల్పించి సర్క్యులర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా హైదరాబాద్ దేవదాయ శాఖ అర్చక ఉద్యోగులకు నెలసరి వేతనాలు 5వ తేదీలోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అనిల్ కుమార్‌ను వారు కోరారు.