- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీపై సర్కార్ ఫోకస్.. కసరత్తు ఘరూ
దిశ, న్యూస్‌బ్యూరో: పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర రాబడి మీద సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మార్చి చివరి వారం నుంచి రెండు నెలల పాటు అమలు చేసిన లాక్‌డౌన్ ముగిసి, సడలింపులు అమలులోకి వచ్చిన తర్వాత కూడా పన్ను ఆదాయం అంచనాలను అందుకోలేకపోతోంది. దీంతో ఆస్తులు అమ్మి పన్నేతర ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. నగరంలో రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన సుమారు 3,700 ఫ్లాట్ల అమ్మకాలను వేగవంతం చేసేందుకు గృహ నిర్మాణ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకోసం ఏకంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్‌నే రంగంలోకి దించింది. కొవిడ్ రాకముందే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం మార్చి రెండోవారంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టింది. సమారు లక్షా 82 వేల కోట్ల ఆదాయంతో అంచనాలను రూపొందించింది. ఇందులో రూ.30 వేల కోట్లు కేవలం పన్నేతర ఆదాయంగానే చూపించింది. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మితే ప్రభుత్వానికి రూ.1500 కోట్ల దాకా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో పక్క మైనింగ్ రెవెన్యూపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనట్లుగా ఈ సంవత్సరం భారీ స్థాయిలో ఇసుక అమ్మకాలు జరిగి సుమారు 2000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని టీఎస్ ఎండీసీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆ సంస్థ ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం, మహదేవపూర్ ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లను పలు మైనింగ్ సంస్థలకు కేటాయించింది. హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగానికి భవిష్యత్తులో ఇసుక అవసరాలు దృష్టిలో ఉంచుకొని నగరంలోని పలు చోట్ల ఇసుక హబ్‌లు ఏర్పాటు చేసి, ఎక్కడి వారికి అక్కడే ఇసుక అందించడానికి ప్రణాళికలు వేస్తోంది. గత సంవత్సరం ఇసుక ద్వారా కేవలం రూ.600 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయి.
భూముల అమ్మకానికి
నైట్ ఫ్రాంక్ సహకారంతోనే హెచ్ఎండీఏ పరిధిలోని వేల ఎకరాలను అమ్మడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినపుడే రాజధానిలో భూములు అమ్మడం ద్వారార నిధులు సమకూర్చుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వివిధ కారణాలతో కోకాపేటలోని హెచ్ఎండీఏ భూముల వేలం నిర్వహించలేకపోయింది. ఈ సారి ఆ భూముల లే అవుట్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే వీలైనంత తొందరగా పూర్తి చేసి వాటి వేలం పాట పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. కోకాపేట భూముల వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం పెద్ద పనేమీ కాదని పలువురు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. చివరి నెల జూన్‌లో మాత్రం లాక్‌డౌన్ సడలింపులతో కాస్త ఊరట లభించింది. ప్రతి నెల 12 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిన చోట పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మే నెలల్లో వందల కోట్లలోనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరింది. పలు రేటింగ్ ఏజెన్సీల అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పడిపోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు భారీ స్థాయిలో గండిపడనున్నట్లు ఇప్పటికే స్పష్టమవుతోంది.