- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రషీద్ ఖాన్‌కు ‘అనుష్క శర్మ’తో పెళ్లి చేసిన గూగుల్..
దిశ, వెబ్‌డెస్క్ : మనలో ఎవరికి ఏ అనుమానమొచ్చినా.. మైండ్‌లో ఏ ప్రశ్న ఉదయించినా.. వెంటనే గూగుల్‌ను జల్లెడ పట్టేస్తాం. అలానే ఓ నెటిజన్.. ప్రస్తుత సన్‌రైజర్స్ బౌలర్, అఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ భార్య ఎవరంటూ గూగుల్‌లో ప్రశ్నించాడు. దానికి బదులుగా గూగుల్.. అనుష్క శర్మ పేరు చూపించడంతో ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. దీంతో ఎక్కడ చూసినా.. ఐపీఎల్ మ్యాచ్‌ల విశేషాలతో పాటు తమ ఆటతీరుతో గేమ్ చేంజ్ చేసిన క్రికెటర్ల గురించే నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇటీవలే సన్‌రైజర్స్‌పై అసాధారణ ఇన్నింగ్స్ ఆడి.. తమ జట్టు(రాజస్థాన్ రాయల్స్)కు విజయాన్ని అందించిన తెవాతియా ప్రస్తుతం గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాడు. అంతేకాదు, తెవాతియా బ్యాచిలరా? కాదా? అని కూడా సెర్చ్ చేశారు. మరోవైపు తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు పడగొడుతూ సన్‌రైజర్స్ జట్టుకు అనూహ్య విజయాలందిస్తున్న రషీద్ ఖాన్ గురించి కూడా ఎక్కువగానే సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఓ నెటిజన్.. రషీద్ ఖాన్ భార్య ఎవరంటే? గూగుల్ అనుష్క శర్మ పేరును సూచించింది. దీంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు రషీద్ ఖాన్‌కు ఇంకా పెళ్లే కాలేదు. ఇక అనుష్క శర్మ విషయానికొస్తే.. ఆమె ఇండియన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ భార్య అని తెలిసిందే. మరి గూగుల్ ఇలా తప్పులో ఎందుకు కాలేసింది? అంటే.
2018లో రషీద్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో అభిమానులు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఆ సందర్భంగా.. ఓ అభిమాని ‘మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు’ అంటూ రషీద్ ఖాన్‌ను అడగడటంతో అనుష్క శర్మ, ప్రీతి జింతా అని పేర్కొన్నాడు. అప్పుడు ఆ యాష్ ట్యాగ్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరి పేరు పాపులర్ కావడంతో గూగుల్ సెర్చ్.. రషీద్ ఖాన్ భార్య అని టైప్ చేయగానే ఇలా చూపిస్తోంది.
గూగుల్ ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడం కొత్తేం కాదు. ఉదాహరణకు.. ఈతపండ్లను ఇంగ్లిష్‌లో ఏమంటారు అని సెర్చ్ చేస్తే.. ‘స్విమ్మింగ్ ఫ్రూట్’ అని బదులిస్తుంది. ఇలాంటి పొరపాట్లను గుడ్డిగా ఫాలో అయితే నెటిజన్లు తప్పులో కాలేయడం గ్యారెంటీ.