- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చనిపోయిన తండ్రి ఫొటోలు గూగుల్ ఎర్త్‌లో..
దిశ, వెబ్‌డెస్క్: ఏడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి ఫొటోలు, జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి గూగుల్ ఎర్త్‌లో కనిపించాయి. ఈ విషయాన్ని చెబుతూ ఆయన చేసిన ట్విట్టర్ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ‘టీచర్‌యూఫో’ అనే ట్విట్టర్ హ్యాండిల్ పేరు గల ఆ వ్యక్తి.. లాక్‌డౌన్ సమయంలో బోర్ కొట్టి గూగుల్ ఎర్త్‌లో అన్వేషణ మొదలుపెట్టాడు. అందులో భాగంగా ఒకరోజు తన తల్లిదండ్రులు ఉన్న ఇల్లు చూడాలని ప్రయత్నించాడు. ఆ ఇల్లు ఫొటో దగ్గర గేట్ బయట నిలబడి ఉన్న తన తండ్రిని, అతనికి ఎదురుగా ఉన్న రోడ్డుమీది నుంచి నడుచుకుంటూ వస్తున్న తన తల్లి ఫొటోలను చూసి ఆశ్చర్యపోయాడు.
గూగుల్ ఎర్త్ సాఫ్ట్‌వేర్‌లో స్ట్రీట్ వ్యూ మ్యాపింగ్ కోసం వాహనాలకు కెమెరాలు అమర్చి రోడ్ల ఫొటోలు తీస్తుంటారు. ఇందులో భాగంగానే ఫొటోలు తీస్తుండగా ఇలా వాళ్లిద్దరూ క్యాప్చర్ అయ్యి ఉంటారు. తన తండ్రిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ వ్యక్తి, గూగుల్‌కు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే ఈ ఫొటోను అప్‌డేట్ చేయవద్దని కోరాడు. ఇప్పటికే ఈ ట్వీట్‌కు 6 మిలియన్ల లైకులు రాగా, మిలియన్‌కు పైగా రీట్వీట్‌లు వచ్చాయి.