- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గూగుల్ న్యూ అప్డేట్‌తో లెస్ ర్యామ్ యూసేజ్
దిశ, ఫీచర్స్: గూగుల్ క్రోమ్ అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్‌లలో ఒకటి. అయితే ర్యామ్(RAM) పరంగా చూసుకుంటే ఎక్కువ స్పేస్‌ను కిల్ చేస్తుండటంతో ఫేమస్ అయినంత స్థాయిలోనే అపఖ్యాతి పాలైంది. కాగా, ఎట్టకేలకు గూగుల్ ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు, క్రోమ్ పనితీరును మెరుగుపర్చడానికి కృషి చేస్తోంది. నెక్ట్స్ అప్‌డేట్‌లో వినియోగదారులకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
విండోస్ 10, ఆండ్రాయిడ్, లైనక్స్‌లో క్రోమ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే ‘పార్టిషన్ అలోక్- ఎవ్రీ వేర్’ సపోర్ట్ కోసం గూగుల్ పనిచేస్తుందని విండోస్ తాజా నివేదిక వెల్లడించింది. పార్టిషన్ అలోక్- ఎవ్రీ వేర్ కారణంగా.. బ్రౌజర్ మరింత త్వరగా ఓపెన్ అవుతుండటంతో పాటు, ఇంటర్నల్ పేజీల లోడింగ్‌లో వేగం పెరగనుంది. మెరుగైన వనరుల నిర్వహణను అందించడానికి అనుమతిస్తుంది. దీంతో ఇది తక్కువ ర్యామ్‌ని ఉపయోగిస్తుంది. కంప్యూటర్‌ను వేగవంతం చేయడంలో సహాయపడే ఉత్తమ ఉచిత పిసి ఆప్టిమైజర్లు ఇవి అని గూగుల్ వెల్లడించింది. గూగుల్ గతేడాది క్రోమ్‌కు ‘పార్టిషియన్ అలోక్’ మద్దతును జోడించే పనిని ప్రారంభించగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్, విండోస్ కోసం బ్రౌజర్ బీటా వెర్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. లైనెక్స్‌లోనూ తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. క్రోమ్‌లో మెమరీ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో మొబైల్‌లో క్రోమ్‌ను ఉపయోగించినప్పుడు మెరుగైన మెమరీ, పనితీరు కనబర్చినట్లు గూగుల్ తెలిపింది.