- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గూగుల్ క్రోమ్.. తెలియాల్సిన టిప్స్
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న దాదాపు ప్రతి ఒక్కరి ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ డీఫాల్ట్‌గా ఇన్స్టాల్ అవుతుంది. అయితే దాని వాడకానికి సంబంధించిన అంశాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే ఓసారి ట్రై చేసి చూడండి.
హోం స్క్రీన్‌లో బుక్‌మార్కులు
యూజర్స్ తరుచుకుగా ఓపెన్ చేసే వెబ్సైట్లను ఫోన్ హోం స్క్రీన్‌లో బుక్ మార్కుల రూపంలో షార్ట్ కట్లు తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు ‘‘www.dishadaily.com” ఎప్పటికీ అందుబాటులో ఉండాలనుకుంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, అడ్రస్ బార్‌లో https://www.dishadaily.com/అని టైప్ చేసి, ముందు సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత క్రోమ్ మెనూలోకి వెళ్లి Add to Home Screen అనే ఆప్షన్ ఎంచుకోండి. అంతే దిశ డైలీ సైట్‌కి ఒక షార్ట్ కట్ మీ ఫోన్లో క్రియేట్ అవుతుంది.
టాబ్లు వేగంగా మారడానికి
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో పలు టాబ్స్ రూపంలో ఒకేసారి పలు వెబ్సైట్లను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది ఎప్పటికప్పుడు తాజాగా అడ్రెస్బార్లో ఇంతకుముందు ఓపెన్ చేసిన సైట్ అడ్రస్ టైప్ చేసి కష్టపడుతూ ఉంటారు. సింపుల్గా అడ్రస్‌బార్ పక్కన కనిపించే tab count వద్ద tap చేస్తే ఇప్పటివరకు ఓపెన్ చేసిన వివిధ వెబ్ సైట్లు tabs రూపంలో కనిపిస్తాయి. వాటిలో కావాల్సిన దానికి ఈజీగా వెళ్లొచ్చు. ఇంకా ఈజీగా కావాలంటే అడ్రస్బార్లో వేలితో కుడివైపుకి గానీ, ఎడమవైపుకి గానీ స్వైప్ చేస్తే సరిపోతుంది. ఒక సైట్ నుంచి మరో సైట్‌కి మారిపోవచ్చు.
పదాలకు మీనింగ్ కావాలంటే
ఇంటర్నెట్లో ఏదైనా సైట్ చూసేటప్పుడు తెలియని పదానికి అర్థం కోసం ఇబ్బందిపడుతుంటాం. అలాంటప్పుడు ఆ పదం మీద tap చేసి వెంటనే ప్రత్యక్షమయ్యే మెనూలో దాని మీనింగ్‌ని తెలుసుకోవచ్చు. లేదా గూగుల్ సెర్చ్ చేయాలన్నా కూడా చేయొచ్చు.
మోడర్న్ ఇంటర్ఫేస్ ఎనేబుల్
గూగుల్ సంస్థ తాజాగా మోడర్న్ ఇంటర్ఫేస్ని రూపొందించింది. డీఫాల్ట్‌గా అది క్రోమ్ బ్రౌజర్లో ఎనేబుల్ అయి ఉండదు. ఒకవేళ దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్బార్లో chrome://flags అని టైప్ చేయాలి. వెంటనే స్క్రీన్ మీద పలు ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడ ఉండే Search బాక్స్‌లో modern అని టైప్ చేసి వచ్చిన ఫలితాల్లో modern design అనే దాన్ని వెతికి పట్టుకోండి. ఇప్పుడు దాన్ని default అని కాకుండా Enabled అనే ఆప్షన్ ఎంపికచేసుకుని బ్రౌజర్ రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.
పేజ్ రిఫ్రెష్ కోసం
కొన్ని వెబ్సైట్లలో కొద్దిసేపటికి ఒకసారి డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తాజాగా వచ్చిన సమాచారాన్ని చూడడం కోసం మాటిమాటికి పేజ్ రీలోడ్ చేయాల్సి ఉంటుంది. అంత కష్టపడాల్సిన పని లేకుండా సింపుల్గా ఏ వెబ్సైట్లో ఉన్నారో ఆ సైట్‌లో ఉండగా, వేలిని పైనుండి కిందకు లాగడం ద్వారా ఆ పేజీ రిఫ్రెష్ చేసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా రీలోడ్ చేయవలసిన పనిలేదు.