- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డిలో తృటిలో తప్పిన ‘రైలు’ ప్రమాదం.. సిబ్బంది అలర్ట్
X
దిశ, కామారెడ్డి : గూడ్స్ రైలు రెండుగా విడిపోయిన ఘటన కామారెడ్డి రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కామారెడ్డి రైల్వే గేటు వద్దకు రాగానే గూడ్స్ బోగీలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో గూడ్స్ రైలు బోగీలు విడిపోయాయి.
అది గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గూడ్స్ రైలును అక్కడే నిలిపివేసి మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు గూడ్స్ రైలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
Advertisement
Next Story