శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

by srinivas |
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 మూడు తేదీలకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ మూడు రోజుల పాటు రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed