ఏపీకి గుడ్ న్యూస్.. ఖరగపూర్-విజయవాడ మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌

by srinivas |
Prahlad Joshi
X

దిశ, ఏపీ బ్యూరో: ఖరగపూర్‌-విజయవాడ (1115 కి.మీ), విజయవాడ-నాగపూర్‌(975కి.మీ)ల మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మాణం కోసం రైల్వే శాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి సోమవారం అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ నేషనల్‌ మినరల్‌ పాలసీ కింద డెడికేటెడ్‌ మినరల్‌ కారిడార్లు కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

మైనింగ్‌ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ కారిడార్లు ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. మినరల్‌ కారిడార్లకు అనుబంధంగా ఖనిజ రవాణా కోసం స్థానికంగా సమగ్రమైన రీతిలో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారీ సరకులతో పొడవాటి ట్రైన్ ల ద్వారా రవాణా చేసేలా రూపుదిద్దుకుంటాయని గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed