- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం జలాలతో పుష్కలమైన పంటలు: మంత్రి ఈటల
దిశ, కరీంనగర్: కాళేశ్వరం జలాలు మొదట ముద్దాడిన కరీంనగర్ జిల్లాలో ఈసారి పుష్కలంగా పంట దిగుబడి వచ్చిందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కాకతీయ కాలువ బాగు చేసి 2500 క్యుసెక్కులకు తోడు మరిన్ని జలాలు అందించామన్నారు. సోమవారం హుజురాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను విపత్కర పరిస్థితుల్లో దళారుల పాలు కానివ్వొదని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వమే ప్రతి గింజనూ కొనుగోలు చేస్తోందన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇన్‌ఛార్జిగా ఓ అధికారిని నియమించాలని కలెక్టర్‌ను కోరినట్టు మంత్రి తెలిపారు. తాలు, తేమ ఉందన్న సాకుతో రైతులను గోస పెట్టొద్దని, ఏదైనా సమస్యలు ఉంటే రైతులు తన దృష్టికి తీసుకురావాలని ఈటల కోరారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళితే తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచించారు.
tags ; kaleshwaram water, good crop production, minister etela rajender