- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లపై జీవో

X
దిశ, తెలంగాణ బ్యూరో: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన మంత్రి మండలి భేటీలో మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీ లకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంగళవారం జీవో విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు ఈ రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. 2021-23 సంవత్సరానికి సంబంధించిన మద్యం దుకాణాల ఏర్పాటు ప్రక్రియలో నూతన రిజర్వేషన్ ద్వారా దరఖాస్తులు తీసుకోనున్నారు.
- Tags
- GOUDs
Next Story