- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి కోసం ఏడు హత్యలు చేసిన ప్రేయసి.. దేశంలో తొలిసారి ఉరికంభం ఎక్కబోతోంది
దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్య్రం వచ్చాక భారత్‌లో తొలిసారిగా ఓ మహిళ ఉరి కంభం ఎక్కబోతోంది. ప్రియుడి కోసం ఆమె తల్లిదండ్రలతోపాటు తోబుట్టులను అతికిరాతంగా హత్య చేసింది. ఈ కేసుకు ఉన్నత న్యాయస్థానం ఆమెకు, ప్రియుడికి ఉరిశిక్ష వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్.. సలీం అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనకున్నారు. కానీ వారి పెళ్లికి షబ్నమ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిపై కోపం పెంచుకున్న ఆమె.. మన పెళ్లికి అడ్డొస్తున్నారని ప్రియుడిని రెచ్చగొట్టింది. ఇద్దరు కలిసి వారిని అడ్డు తొలగించుకోవాలని పధకం పన్నారు. దీనిలో భాగంగా ఇంట్లో ఉన్న షబ్నమ్.. ఆమె ప్రియుడు కలిసి తల్లిదండ్రులతోపాటు సోదరులు, సోదరి సహ ఏడుగురిని గొడ్డలితో నరికి చంపేశారు.
కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు.. కూతురే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పూర్తి ఆధారాలను కోర్టుకు అందించారు. దీనిపై విచారణ చేసిన కోర్టు షబ్నమ్, సలీంలకు ఉరి శిక్ష వేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ.. ఆ జంట సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా వారి నేరానికి ఉరిశిక్షే సరైనదని భావించి కింది కోర్టు తీర్పును సమర్ధించింది. చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ కూడా ఆ హంతక జంటకు చుక్కెదురు కావడంతో ఉరి శిక్ష తప్పలేదు.
ఈ జంటను ఉరి తీయడానికి మధుర జైలు అధికారులు చురుగ్గా ఏర్పాటు చేస్తున్నారు. కాగా వీరిని నిర్భయ కేసు నిందితులను ఉరి తీసిన పవన్ జల్లాదే ఉరి తీయనున్నారు. ఆయన ఇప్పటికే రెండుసార్లు ఉరితీసే గదిని పరిశీలించారు. ఈ జంటను ఉరి తీసే తేదీ ఇంకా ఖరారు కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. 2008లో జరిగిన ఈ హత్యల కేసు విచారణ 12 ఏళ్లు జరిగింది. అయితే ఒక మహిళకు భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉరి శిక్ష వేయడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.