- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎవరికీ తెలవకుండా అద్దె గదిలో సహజీవనం.. ఊరికొచ్చాక ప్రియుడి తండ్రి కూడా..
దిశ, వెబ్ డెస్క్: తనను ప్రేమించి ఏడాదిపాటు సహజీవనం చేసి, పెళ్లి చేసుకోమంటే చేసుకోవడంలేదంటూ ఓ ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేసింది. అయినా కూడా ప్రియుడు తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని, అతని కుటుంబ సభ్యులు తనను గెంటేసే ప్రయత్నం చేశారని మండిపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే, ఆ యువకుడు ఇంజినీరింగ్ విద్యనభ్యసించేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. దీంతో ఆ యువతి కూడా చదువుకునేందుకు, కంప్యూటర్ ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ కు వచ్చింది. అయితే, వీరిద్దరూ కలిసి నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఏడాదిపాటు సహజీవనం చేశారని, దీంతో ఆ యువతి గర్భం దాల్చినట్లు సమాచారం. అయితే, ఆ యువతి తనని పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి చేయడంతో అతను నిరాకరించాడు. దీంతో ఆ యువతి తిరిగి తన గ్రామానికి చేరుకుంది. విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో గ్రామస్తులతో పంచాయితీ పెట్టించారు. ఆ పంచాయితీలో తన కూతురు పెళ్లి అయిపోయినంక ఆ యువతిని తన కొడుకు పెళ్లి చేసుకుంటాడని ప్రియుడి తండ్రి కూడా మాటిచ్చాడు. కానీ, ఆ తర్వాత కూడా ప్రియుడు మాట మార్చడంతో ఆ యువతి ప్రియుడి ఇంటిముందు ధర్నా చేసినట్లు సమాచారం. ఈ సమయంలో ప్రియుడి తల్లిదండ్రులు ఆ యువతిని బయటకు పంపే ప్రయత్నం చేశారని, దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.