- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలిక కిడ్నాప్: మూడు గంటల్లోనే..
దిశ, కంటోన్మెంట్: బాలిక కిడ్నాప్ అయినా మూడు గంటలకే చేధించారు బోయిన్‌పల్లి పోలీసులు. ఇన్ స్పెక్టర్ అంజయ్య కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన నాగమ్మ(38) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి తన కుమారుడితో కలిసి ఐడీఏ బొల్లారంలోని బీరప్ప బస్తీలో నివాసం ఉంటుంది. బాచుపల్లి విజేత మార్కెట్ వద్ద పూలు అమ్ముకుంటు జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో జనార్థన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పిల్లలను కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని నాగమ్మతో చెప్పాడు. దీంతో వీరిద్దరూ కిడ్నాప్ ప్లాన్‌తో.. ఈ నెల 21న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మెదక్ జిల్లా సేరుపల్లికి చెందిన పత్తిరి స్వరూప(25) తన మూడేళ్ల కుమార్తె సరితతో కలిసి బిక్షాటన చేస్తూ వీరి కంట పడింది. దీంతో వీరి దృష్టి స్వరూపపై పడింది. రోజులు బాగాలేవని ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదని స్వరూపను భయపెట్టారు. తమ ఇంటికి వచ్చి రాత్రికి ఉండి ఉదయాన్నే ఊరు వెళ్లిపోవాలని స్వరూపను నమ్మించారు.
దీంతో స్వరూప తన బిడ్డతో నాగమ్మ ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం స్వరూపను బస్సు ఎక్కించేందుకు నాగమ్మ మరో ఇద్దరితోకి కలిసి బోయిన్‌పల్లి బస్టాండ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సరిత ఆకలి అంటూ ఏడ్చింది. ఇదే అదనుగా భావించిన నాగమ్మ స్వరూపకు రూ.50 ఇచ్చి ఏదైనా ఆహారం తీసుకురావాలని పంపించించి. స్వరూప అటు వెళ్లగానే నాగమ్మ చిన్నారితో నిజామాబాద్ బస్సులో ఉడాయించింది. ఆహారం కోసం వెళ్లిన స్వరూప తిరిగొచ్చేసరికి తన కుమార్తె, నాగమ్మ కన్పించకపోవడంతో ఆందోళనకు గురైంది. దీంతో ఆమె పోలీసులను అశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సై సుధాకర్‌రెడ్డి సీసీ పుటేజ్ ఆధారంగా నాగమ్మను మూడు గంటల వ్యవధిలోనే పట్టుకుని బాలికను క్షేమంగా తల్లికి అప్పగించారు. దీంతో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది.