కరోనా లక్షణాలతో బాలిక మృతి

by Aamani |

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి(కె) గ్రామంలో ఓ బాలిక కరోనా లక్షణాలతో మృతి చెందింది. కుభీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన ద్రుపత గంగాధర్ దంపతులు గత కొన్నేళ్ల నుంచి ఉమ్రిలో ఉంటున్నారు. వీరి కూతురు గాయత్రి(16) రక్త హీనతతో బాధపడుతుంటంతో ఇటీవల నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. గాయత్రికి కరోనా లక్షణాలు ఉండటంతో పకడ్బందీగా అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు 8 మందిని కరోనా పరీక్షల కోసం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed