- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కనికరం లేని జీహెచ్ఎంసీ.. పిల్లలతో రోడ్డున పడ్డ కుటుంబాలు
దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో ఉన్న రంగనాథ్ నగర్ వెంచర్‌లో ఉన్న ఇళ్లను జీహెచ్ఎంసి అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. సర్వే నెంబర్ 277, 278, 279లో పదేళ్ల క్రితం వెంచర్ వేశారు. ఇందులో ప్లాట్లు కొనుక్కున్న వారు ఇల్లు కట్టుకున్నారు. అయితే ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అంటూ భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడంతో ఇళ్లల్లో ఉన్నవారు రోడ్డున పడ్డారు.
నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి పూర్తిగా ధ్వంసం కావడంతో కట్టుబట్టలతో బజారున పడ్డారు. రాత్రి కావడంతో ఎక్కడ ఆశ్రయం పొందాలో అంతుచిక్కని పరిస్థితుల్లో చిన్నారులతో బిక్కుబిక్కుమంటన్నారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్‌లలో ఇల్లు కట్టుకుంటే వాటిని కూల్చివేయడం దారుణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించ లేదు.
- Tags
- GHMC
- gopanapalli