అనుమతులున్నా.. అధికారులు అడ్డుకుంటున్నారు

by Anukaran |
అనుమతులున్నా.. అధికారులు అడ్డుకుంటున్నారు
X

దిశ, శేరిలింగంపల్లి: “వాస్తవ పరిస్థితులను, ఆస్తి పత్రాలను పరిశీలించకుండా, సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే అనుమతులు ఇచ్చిన కట్టడాలను కూడా కొనసాగనీయకుండా జీహెచ్ఎంసీ అధికారులు అడ్డుపడడం బాధాకరం. అప్పనంగా వచ్చిన సొమ్ముకు అలవాటు పడిన కొందరు అదేపనిగా భవన నిర్మాణాల వద్దకు వెళ్లి బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయటం పరిపాటిగా మారింది.. జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిజాలు తెలుసుకోకుండా, బ్లాక్ మెయిల‌ర్లకు కొమ్ము కాసినట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది..” అని సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే ఒపీనియన్​ ఇది.

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వ్యవహార శైలి, పనితీరుపట్ల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కొందరు అధికారులు కూడా ఆయన ఆవేదనకు అద్దం పట్టేలా వ్యవహరించడం కొసమెరుపు. కూకట్‎పల్లి జోన్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారికి ఎమ్మెల్యే కాదు కదా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పినా డోంట్ కేర్ అంటారు. నిర్మాణం సక్రమమైనా నానా కొర్రీలు పెట్టి కొందరు బ్లాక్ మెయిలర్లతో బిల్డింగ్ కు ఇంతా అని వసూల్ చేయిస్తారని, లేదంటే పర్మిషన్​ పేరిట ఇబ్బందులు పెడుతారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు చెప్పినా సీజ్ చేయని అధికారి..

హైదర్ నగర్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలు సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సదరు అధికారిణి నామమాత్రంగా ఒకటి రెండు ఇళ్లను సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. మిగతా వాటిని రెండు రోజుల తర్వాత సీజ్ చేస్తామని చెప్పి నిష్క్రమించి మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నా డు. సీజ్​ చేయాల్సిన జాబితాను కూడా బహిరంగపర్చలేదు. అదే విషయా న్ని టౌన్ ప్లానింగ్ అధికారిని అడిగితే ఇప్పుడు లిస్ట్​ లేదు, వారం ఆగి రండి ఇస్తాం అంటూ దాటవేశారు. పైగా, ఈ విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నరు.. ఆ సమయంలో ఎటెళ్లారు అంటూ దబాయించే నైజం అధికారి సొంతం. ఇటీవలే ప్రభుత్వ స్థలంలో జరిగిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారి, బ్లాక్ మెయిలర్లతో పరోక్షంగా బెదిరిస్తూ, నిర్మాణం పూర్తయ్యాక కూల్చేస్తామని భయపెడుతున్నారంటూ ఓ బాధితుడు వాపోయాడు.

ఎమ్మెల్యే ఒకవైపు మాత్రమే చూస్తున్నారా..

ఎమ్మెల్యే గాంధీ ఆవేదనలో నిజమున్నా అక్రమ నిర్మాణాల విషయంలో నూ ఇదే ధోరణి అవలంబించాలా.? అధికార పార్టీ నేతల కట్టడాల విష యంలో చూసీచూడనట్టు వ్యవహరించాలా అన్నది కొందరు అధికారులకు శేష ప్రశ్నగా మారింది. అనుమతులు లేనిచోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేశారనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తాయి. అలా అని వదిలే స్తే ఉన్న స్థలానికి, పర్మిషన్స్ కు సంబంధం లేకుండా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తాయి. ఇప్పుడు ఎలా అన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తనన్నది కొందరు అధికారులు, బ్లాక్ మెయిలర్లతో కలిసి చేస్తున్న వ్యవహారాలపై మాత్రమేనని ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. సక్రమంగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి వసూళ్లకు పాల్పడుతున్న బ్లాక్ మెయిలర్లు, అధికారులు ఇకనైనా తీరు మార్చుకోవాల్సిందే అని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

ఎమ్మెల్యే తీరు హాస్యాస్పదం..

అక్రమ నిర్మాణాలు చేస్తుంది అధికార పార్టీ నేతలే.. వాళ్లను కాదని ఎవరైనా సామాన్యుడు నిర్మాణాలు చేస్తే అక్కడికి వెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తుంది కూడా వాళ్లే అన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారులను తప్పుబట్టడం, వారిపై అసహనం వ్యక్తం చేయడం హాస్యాస్పందగా ఉంది. ఎమ్మెల్యేకు ఇప్పుడే బ్లాక్ మెయిలర్లు గుర్తుకు వచ్చా రా? ఈతరహా వ్యవహారాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. -అరుణ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు

Advertisement

Next Story

Most Viewed