భారత ప్రయాణికులకు జర్మనీ గుడ్‌న్యూస్..

by vinod kumar |   ( Updated:2021-07-05 21:19:27.0  )
Germany lifts ban on travelers from delta variant hit India
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రత దృష్ట్యా జర్మనీ ప్రభుత్వం దేశీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో భారతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసినట్లు జర్మనీ ప్రకటించింది. భారత్‌తో సహా యూకే ప్రయాణికులు సైతం తమ దేశంలో అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించింది. జర్మనీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ, యూకే విద్యార్థులు, ఉద్యోగస్తులకు భారీ ఊరట లభించనుంది.

Advertisement
Next Story

Most Viewed