సాయంత్రం 5 గంటల వరకే..

by Shyam |   ( Updated:2022-09-03 10:35:35.0  )
సాయంత్రం 5 గంటల వరకే..
X

దిశ, హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజు రోజుకీ పెరుగుతోన్న కేసుల సంఖ్య జనాన్ని భయపెడుతోంది. దీంతో వ్యాపారులు బిజినెస్ కంటే ఆరోగ్యం ప్రధానమన్న నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా బేగంబజార్, అఫ్జల్ గంజ్ ఏరియాల్లో దుకాణాల పని వేళలను కుదించారు. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంచాలని జనరల్ మర్చంట్స్ అసోసియేషన్లు తీర్మానించాయి.

గురువారం అసోసియేషన్లు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు శ్రీరాం వ్యాస్, ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ వర్గి ఓ ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ల నిర్ణయంతో బేగంబజార్, ఉస్మాన్ గంజ్, సిద్ధి అంబర్ బజార్, ఎన్‌ఎస్ రోడ్డు, ఫీల్‌ఖానా ప్రాంతాల్లోని 800లకు పైగా దుకాణాలు సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. హోల్‌సేల్ దుకాణాలు మధ్యాహ్నం 3 గంటల వరకే తెరిచి ఉంచుతారు. భారత సైనికులపై చైనా దాడిని నిరసిస్తూ ఆ దేశ ఉత్పత్తులను విక్రయించొద్దని కిరాణా, జనరల్ మర్చంట్ అసోసియేషన్లు తీర్మాణించాయి.

Advertisement

Next Story

Most Viewed