- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఏడాది 9 శాతం వృద్ధితో సాధారణ బీమా పరిశ్రమ..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సాధారణ బీమా పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో 7-9 శాతం వృద్ధి నమోదవచ్చని పెట్టుబడుల సమాచార సంస్థ ఇక్రా తెలిపింది. ఆరోగ్య, మోటార్ బీమా విక్రయాల్లో పెరుగుదల ఈ వృద్ధికి తోడ్పడుతుందని ఇక్రా అభిప్రాయపడింది. 2020-21లో పరిశ్రమ 4 శాతం వృద్ధితో రూ. 1.85 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థలు ఆన్‌లైన్ విధానాన్ని అందుకోవడంలో వెనకబడ్డాయి. అందుకే వృద్ధి స్వల్పంగానే ఉందని ఇక్రా తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రీమియం ఆదాయం 2 శాతం క్షీణించి రూ. 71,800 కోట్లుగా ఉండగా, ప్రైవేట్ రంగ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం 8 శాతం పెరిగి రూ. 1.13 లక్షల కోట్లకు చేరుకుందని ఇక్రా పేర్కొంది. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం వృద్ధిని సాధించింది. సాధారణ బీమా పరిశ్రమకు కీలక మద్దతుగా ఉన్న మోటార్ బీమా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 37 శాతం క్షీణించింది. వాహన పరిశ్రమ తీవ్ర ఆటంకాలను ఎదుర్కోవడం వల్లనే ఈ స్థాయి క్షీణత నమోదైనట్టు ఇక్రా వివరించింది. అగ్ని ప్రమాద బీమా ప్రీమియం ఆదాయం 27 శాతం పెరిగింది.