రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..

by Sridhar Babu |
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కెమికల్ గ్యాస్ లీక్ అవుతోంది. గత వారం రోజులుగా ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా, యూరియా పై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మోనియా ప్లాంట్‌లో పైప్ లైన్ నిర్మాణంలో ఏర్పడిన సమస్య వలన కర్మాగారం నుంచి గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం.

ఇదిలాఉండగా, వారం కిందట నైట్రోజన్ పైప్ లీకవడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గతకొన్నేండ్లుగా మూతబడియున్న రామగుండం ఎరువుల కంపెనీని ఇటీవల పునరుద్ధరించిన విషయం తెలిసిందే. తాజాగా గ్యాస్ లీకవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed