అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్.. పరుగులు తీసిన గ్రామస్తులు

by srinivas |
అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్.. పరుగులు తీసిన గ్రామస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలోని పరవాడ మండలం భరణికం వద్ద అనన్య అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి.. కంపెనీలో ట్యాంకర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది లీకేజీని అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, గ్యాస్ లీకేజ్ కారణంగా గ్రామస్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. గ్యాస్ లీక్ కావడం వల్ల కళ్ళు మంటలు, శరీరంపై మంటగా అనిపించినట్లు స్థానికులు చెప్పారు.

Advertisement
Next Story

Most Viewed