కరాచీలో భారీ పేలుడు.. కారణం అదే అంటున్న అధికారులు..

by Shamantha N |
pakistan
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకై శనివారం భారీ పేలుడు సంభవించడంతో 12 మంది మరణించారు. పాకిస్తాన్ రేవు పట్టణం కరాచీలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. షేర్ షా ప్రాంతంలోని భవంతిలో పేలుడు జరిగినట్లు గుర్తించారు. భారీ పేలుడు కారణంగా మొదటి అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. భవనం రెండో అంతస్తులోని కిటికీలు, తలుపులు ఊడిపోవడమే కాకుండా, పత్రాలు చెల్లాచెదురుగా ఆ ప్రాంతమంతా విస్తరించినట్లు తెలిపారు. పక్కనే నిలిపి ఉన్న కార్లు, మోటార్ సైకిళ్లు కూడా ధ్వంసమయ్యాయని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాంబు డిస్పోసల్ బృందం గ్యాస్ లీకేజ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిపింది. వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్లనే, కార్లలోనూ ఉపయోగించడం సమస్యగా పేర్కొన్నారు. కాగా ప్రమాదంలో 12 మంది మరణించిగా, మరో 13 మంది గాయపడినట్లు వైద్య అధికారులు తెలిపారు.

Advertisement

Next Story