- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నూరైనా ఐపీఎల్ ఆగదు : సౌరవ్ గంగూలీ
ఆరు నూరైనా ఐపీఎల్‌ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చెన్నై, ముంబై జట్ల మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్‌కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారు. ఇలా పెద్ద ఎత్తున గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున.. ఐపీఎల్‌ను వాయిదా వేసే అవకాశం ఉందని’ చెప్పారు.
మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న విషయం వాస్తవమే. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఐపీఎల్ వాయిదా వేయబోమని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్‌లు జరిగే అన్ని ప్రాంతాల్లో కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని గంగూలీ హామీ ఇచ్చారు. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి కరోనా ప్రభావం కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags: IPL, BCCI, Sourav ganguly, schedule, Mumbai, Health Minister