- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ పోచారం చేసిన పనికి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
దిశప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన పని ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని గ్రామంలో శాసనసభాపతి పోచారం మంగళవారం అంగన్ వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే, సదరు భూమి గంగాధర్ అనే వ్యక్తి నివాస స్థలం పరిధిలో ఉన్నది. బాధితుడికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఆ స్థలంలో గ్రామంలో ఇటీవల మంజూరైన అంగన్ వాడీ భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు.
ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు సభాపతి దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన పట్టించుకోకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన గంగాధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగాధర్‌ను కుటుంబ సభ్యులు స్థానిక బోధన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కాసుల బాల్‌రాజ్ స్పందించి ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో భూమి పూజ చేసి సంబంధిత వ్యక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో పాటు అతని ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గంగాధర్ కుటుంబానికి న్యాయం చేయాలని లేకపోతే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.