- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30న కాంగ్రెస్‌లోకి కీలక నేత.. అనూహ్యంగా మారిన రాజకీయాలు
దిశ, శాయంపేట: ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ రావు ఈనెల 30వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాయంపేట మండల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే గండ్ర మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్దకొడపాక, గట్లకానిపర్తి, కొప్పుల, శాయంపేట తదితర గ్రామాల్లో పర్యటించి, టీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులతో పాటు మాజీ శాసన సభ స్పీకర్ మధుసూధనాచారి వర్గానికి చెందిన పలువురిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తనతో కలిసి రావాలని రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అంతేగాకుండా.. గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలియడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. గండ్ర సత్తన్న చేరికతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నట్లు సమాచారం. ఇంతకాలం టీఆర్ఎస్ వైఖరితో విసుగెత్తిన అసంతృప్తులతో పాటు మాజీ శాసన సభ స్పీకర్ మధుసూధనాచారి వర్గాన్ని తనవైపు ఆకర్షించడం టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీలో ఎన్నికల్లో గండ్ర సత్తన్న గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో గండ్ర సత్తన్న చేరికతో మండల రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.