పర్యావరణ హితం.. గోమాయ గణపతి

by Shyam |
పర్యావరణ హితం.. గోమాయ గణపతి
X

దిశ, పటాన్‌చెరు: వినాయక చవితి వస్తుందంటే రంగురంగుల గణపతులు మార్కెట్‌లో దర్శనమిస్తుంటాయి. రసాయనాలతో తయారు చేసిన ప్రతి మలతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీంతో మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినియోగించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. అయితే మరో అడుగు ముందుకేసి గోమయంతో గణపతులు తయారుచేస్తున్నారు బీరంగూడ గోశాల నిర్వాహకులు.

అమీన్ పూర్ పట్టణంలోని బీరంగూడ గుట్టపైన కామదేను జీవరక్ష సమితి ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి గోశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుమారు 800 ఆవులను సంరక్షిస్తున్నారు. సుదర్శన్ సింగ్ అనే కళాకారుడు ఆవుపేడతో గణపతి ప్రతిమలను గత రెండేళ్లుగా తయారుచేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.

Advertisement

Next Story