- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో విడుదలైన ‘గెలాక్సీ వాచ్3’
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్.. రెండు స్మార్ట్ వేరబుల్స్‌ను సోమవారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో గ్లోబల్‌గా లాంచ్ చేసిన శాంసంగ్.. ప్రస్తుతం వాటిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది. గెలాక్సీ వాచ్ 3 పేరుతో ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను, గెలాక్సీ బడ్స్ లైవ్ పేరుతో వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
గెలాక్సీ వాచ్‌ను ప్రీమియం మెటీరియల్స్‌తో తయారుచేసినట్లు శాంసంగ్ చెబుతుండగా.. ఈ వాచ్‌లో 40 భిన్నమైన వర్క్‌వుట్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ఏడు ఎక్సర్‌సైజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉన్న ఈ వాచ్‌లో బిగ్గర్ డిస్‌ప్లేతో పాటు ప్రత్యేకంగా ఈసీజీ సెన్సార్‌ను అందిస్తున్నారు. ఇవేకాక గొరిల్లా గ్లాస్ డీఎక్స్ ప్రొటెక్షన్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.0, 4జీ ఎల్‌టీఈ, వైఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి బ్లూ టూత్ మోడల్ కాగా, రెండోది 4జీ మోడల్. ఆగస్టు 27 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.
గెలాక్సీ వాచ్ 3 స్మార్ట్‌వాచ్ ఫీచర్స్:
డిస్‌ప్లే: 1.4/1.2 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
ప్రాసెసర్: డ్యుయల్ కోర్ ఎగ్జినోస్ 9110
ర్యామ్: 1జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 8జీబీ
ధర: రూ.29,990/- ( బ్లూటూత్ మోడల్ )
రూ.34,490/- (4జీ మోడల్)
గెలాక్సీ బడ్స్ : ఇవి మూడు మైక్రోఫోన్లతో పాటు వాయిస్ పికప్ యూనిట్‌ను కలిగి ఉన్నాయి. అంతేకాదు, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. 8 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది. కేవలం 5 నిమిషాల చార్జింగ్‌తో 1 గంట పాటు ప్లే టైమ్ వస్తుంది. ఇందులో బ్లూటూత్ 5.0, 12 ఎంఎం డ్రైవర్ యూనిట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, వాటర్ రెసిస్టెన్స్ తదితర ఫీచర్లను అందిస్తోంది శాంసంగ్. వీటి ధర రూ.14,990/-. ఆగస్టు 25 నుంచి లభించనున్నాయి.