- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాధ్యతలు స్వీకరించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు పాల్గొన్నారు.
ఈనెల 11న జరిగిన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో గ్రేటర్ పీఠాన్ని ఇద్దరు మహిళలు దక్కించుకున్నారు. ఎంఐఎం మద్దతుతో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, మోతె శ్రీలత ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఎన్నికవ్వగా.. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు. మేయర్ విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. వివాహానంతరం ఆమె 18 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నారు. ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు.