- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.8.80 కోట్ల కుంభకోణంలో గడ్డిఅన్నారం చైర్మన్, కార్యదర్శి సస్పెండ్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపి చైర్మన్, కార్యదర్శిపై వేటు వేసినట్లు మార్కెట్ అధికారి పద్మహర్ష స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. సీఎం ఆదేశాలతోనే మార్కెట్ కమిటీ చైర్మన్, సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్లను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సంబంధిత చైర్మన్, కార్యదర్శిలకు గురువారం అందించినట్లు తెలుస్తోంది.
గడ్డిఅన్నారం మార్కెట్లో రూ.8.80కోట్ల లంచాలు తీసుకొని 176 మంది వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్లకు అనుమతినిచ్చారు. ఈ అవినీతి బాగోతం బహిర్గతం కావడంతో వేటు పడింది. దిశ దినపత్రికలో ‘‘గడ్డిఅన్నారం మార్కెట్లో అక్రమాలు” అనే కథనాలు ప్రచురించడం జరిగింది. ఈ కథనాలతో ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆ అవినీతిపై ఓ అధికారితో విచారణ చేపట్టి నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ఆధారంగానే చైర్మన్, కార్యదర్శిపై ప్రభుత్వం వేటు వేసింది.
ఇదే మొదటి సారి…
రాష్ట్ర ప్రభుత్వం నామినేటేడ్ పద్ధతిలో చైర్మన్, పాలకవర్గ సభ్యులను నియామిస్తుంది. ఈ సభ్యుల పదవికాలం ముగిసే వరకు పదవులను అనుభవిస్తారు. కానీ గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చరిత్రల్లో పదవికాలం పూర్తికాకముందే సస్పెండైన చైర్మన్ వీరమల్ల రాం నర్సింహ గౌడ్ కావడం విశేషం. చైర్మన్ పదవీకాలం ఏడాది సమయంగా రెండు పర్యాయాలుగా అవకాశం కల్పించారు. అయితే రెండో పర్యాయం పూర్తి కావాడానికి ఇంకా 4 నెలల సమయం ఉండగానే పదవి పోగొట్టుకోవడం గమనార్హం. గడ్డిఅన్నారంలో అక్రమాలు సాధరణంగానే జరుగుతుంటాయి. కానీ ఇంత స్థాయిలో ఎప్పుడు జరగలేదని, పాలకవర్గం సభ్యులు సైతం రాంనర్సింహను వ్యతిరేకించడంపై సీఎం కేసీఆర్ అగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.