- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్రె జంగమ్మ పోరాటానికి సంపూర్ణ మద్దతు
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఘట్ కేసర్ మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు, నారాయణరావు కాలువ వెంబడి బఫర్ జోన్ లలో కట్టడాలు కొనసాగుతున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని మండల వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇటీవల ఆమె తన వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీకి ఓ లేఖ ద్వారా సమాచారం అందించారు. దీంతో స్పందించిన కేఎల్ఆర్ వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మను తన నివాసానికి ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం ఉదయం నగరంలోని కేఎల్ఆర్ నివాసానికి టీపీసీసీ జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్ నాయకులతో కలసి వెళ్లిన ఆమె కేఎల్ఆర్ తో భేటీ అయ్యారు.
అనంతరం ఆమె మండలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కేఎల్ఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా కేఎల్ ఆర్ మాట్లాడుతూ ఘట్ కేసర్ మండలంలో అవినీతి ఆక్రమణలపై కర్రె జంగమ్మ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేసే యోచనను విరమించుకోవాలని కోరారు. అధికార పార్టీ మంత్రి మల్లారెడ్డి, నాయకులు అవినీతిని మానుకొని ప్రభుత్వ భూములు, పార్కు, గ్రామకంఠం స్థలాలను పరిరక్షించాలని, అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, నారాయణరావు సాగునీటి కాలువ వెంబడి బఫర్ జోన్ లలో కట్టడాలను కూల్చివేయాలని మంత్రిని డిమాండ్ చేశారు.
మేడ్చల్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ నాయకుల అవినీతి, ఆక్రమణలకు వ్యతిరేఖంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయనున్నట్టు కేఎల్ఆర్ వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అమర్, మండల ప్రజా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మక్బుల్, కాంగ్రెస్ పార్టీ ఔషపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగయ్య, ఎదులాబాద్ అధ్యక్షుడు నర్సింహా, కాచవాని సింగారం గ్రామ శాఖ అధ్యక్షుడు చిత్తలూరి నవీన్, మర్పల్లిగూడ గ్రామ శాఖ అధ్యక్షుడు కిష్టయ్య, ఎఫ్ఎస్ సిఎస్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, మాజీ డైరెక్టర్ సత్తయ్య, కాచవాని సింగారం మాజీ ఉప సర్పంచ్ అశోక్, చౌదరిగుడ మాజీ వార్డు శ్రీనివాస్ గౌడ్, నాయకులు సిహెచ్ నరసింహ, వినోద్, శ్రావణ్ తదితరులు ఉన్నారు.