తీరం వెంబడి ఈదురు గాలులు.. ఒక్కసారిగా చల్లబడ్డ విశాఖ!

by srinivas |   ( Updated:2021-04-03 11:47:52.0  )
తీరం వెంబడి ఈదురు గాలులు.. ఒక్కసారిగా చల్లబడ్డ విశాఖ!
X

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో పాటు బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విశాఖలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రిసిటీని తిరిగి పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గాలులు బలంగా వీస్తుండటంతో తీరం వెంబడి నివసించే వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైల్వే న్యూ కాలనీలో వరద చేరుకోవడంతో ఇళ్లలోని వస్తువలు తడిచిపోయినట్లు సమాచారం. పలుచోట్ల వాహనదారులు నీటిలో చిక్కుకుపోయారు.

Advertisement

Next Story