- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యవసాయ కూలీలకు ఫుల్ డిమాండ్.. డబ్బులు ఇచ్చిన రావడం లేదు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది, సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతుండటంతో కూలీలు దొరకడం కష్టతరంగా మారింది, విత్తనాలు నాటే సమయంలో కూలీలకు డిమాండ్ ఏర్పడటంతో రోజుకు రూ.500 వరకు కూలీ చెల్లించే పరిస్థితులు ఏర్పడ్డాయి, అత్యధికంగా 80లక్షల ఎకరాల్లో సాగువుతున్న పత్తి పంటకు, 48.67లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరి పంటలకు విత్తనాలు నాటేందుకు, నాట్లు వేసేందుకు కూలీలు దొరకడం లేదు, వ్యవసాయంలో అదునూతన యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ వానాకాలంలో రాష్ట్రంలో అత్యధికంగా 1,62,42,900 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
కరోనా ప్రభావంతో పట్టణాలు విడిచి గ్రామాలకు తరలివెళ్లిన ప్రజలు పొలం బాట పట్టారు. తమకున్న ఎకరం, రెండెకరాల భూమిని సాగుచేసుకొని పల్లెలోనే బతుకుదామనే నిర్ణయానికి వచ్చారు, వాతవారణం సహకరించడం, సకాలంలో వర్షాలు కురియడంతో నేల తల్లిని నమ్ముకుని పొలం పనులు మొదలు పెట్టారు, ఈ మార్పులతో రాష్ట్ర వ్యవసాయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో ఒక్క సారిగా కూలీల కొరత ఏర్పడింది, గతంలో కూలీలుగా ఉన్న వారు ప్రస్తుతం స్వయంగా భూములు సాగు చేస్తుండటంతో కూలీలు దొరకని పరస్థితి ఏర్పడింది, దీంతో విత్తనాలు నాటే సమయం దాటి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పత్తి , వరి పంటలకు కూలీల కష్టాలు
రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న 80లక్షల ఎకరాల పత్తి, 48.67,000 ఎకరాల వరి పంటలకు కూలీ కష్టాలు ఏర్పడ్డాయి, బుతుపవనాల రాకతో సాగుకు కావల్సినంతగా నేలులు తడిసాయి. ఈ సమయంలో పత్తి విత్తనాలు నాటితే మొలకలు బాగావచ్చి పంట ఏపుగా పెరిగే అవకాశాలున్నాయి. సకాలంలో విత్తనాలు నాటకపోవడం వలన పంటల దిగుబడులు తగ్గే అవకాశాలున్నాయి. పత్తి విత్తనాలను నాటేందుకు ఎలాంటి అదునూతన యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో తప్పని సరిగా మనుషులే నాటాల్సి వస్తుంది. వరి సాగులో డ్రం సీడ్ పద్దతి చేపట్టేందుకు సరిపడా యంత్రాలు రైతుల చెంత లేకపోవడంతో కూలీలను ఆశ్రయించాల్సి వస్తుంది. సరిపడా కూలీలు లేకపోవడంతో పంటలను సరైన సమయాల్లో సాగుచేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
రూ.500 వరకు డిమాండ్ చేస్తున్న కూలీలు..
గతంలో కూలీలుగా ఉన్న చాలా మంది ప్రస్తుతం తమకున్న ఎకరం, రెండెకరాలను సాగు చేయడం, లేదా కౌలుకు భూమి తీసుకొని సాగు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన యువత పొలంబాట పట్టడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. స్వయంగా సాగు పనులు చేపట్టడంతో ముందుగా సొంత పొలంలో పనులు పూర్తయ్యాకే ఇతరుల పొలంలో కూలీలు వెళుతున్నారు, దీంతో ఒక్క సారిగా కూలీల డిమాండ్ పెరిగింది. రోజుకు రూ.500 చెల్లిస్తే కూలీలు పనుల్లోకి వస్తున్నారు, కూలీ కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి మరీ వ్యవసాయ పనులకు తీసుకువెళ్తున్నారు.
కూలీల డిమాండ్ పెరిగింది:
ఈ ఏడాది 4 ఎకరాల్లో పత్తిపంట సాగు చేపట్టాం, ఇటీవల కురిసిన వర్షాలుకు భూబాగం తడవడంతో విత్తానాలు నాటుతున్నాం, మా గ్రామంలోని కూలీలు ఈ ఏడాది కొత్తగా సాగు పనులు చేపట్టారు, వాళ్ల పొలంలో పనులు పూర్తయ్యాకే ఇతరుల పొలంలో కూలీకి వస్తున్నారు. దీంతో కూలీకి డిమాండ్ బాగా పెరిగింది. సరైన సమయంలో విత్తనాలు నాటుతామో లేదో అనే ఆందోళన కలుగుతుంది.
తిరుపతయ్య , నాగర్‌కర్నూల్ జిల్లా పర్వతాపురం గ్రామం
రూ.500 వరకు డిమాండ్ చేస్తున్నారు
కూలీల కొరత ఏర్పడటంతో కూలీ ధలు కూడా పెరిగాయి, రోజుకు రూ.500 చెల్లిస్తే కాని కూలీలు రావడం లేదు, దీంతో పెట్టుబడి ఖర్చులు గతేడాదికంటే ఈ సారి బాగా పెరిగాయి, ఎరువులు, విత్తనాలు ధరలు కూడా పెరిగాయి. పెట్టుబడులు పెరుగుతున్నాయి కాని మద్దుతు ధర మాత్రం పెరగడం లేదు.
రవి, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం గ్రామం