- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూన్‌లో పెరిగిన ఇంధన డిమాండ్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షల నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా తిరిగి ప్రారంభమవుతోంది. ఏప్రిల్‌లో 13 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన ఇంధన డిమాండ్ జూన్‌లో కొంత కోలుకుంది. శుద్ధి చేసిన ఇంధన వినియోగం జూన్‌లో 16.29 మిలియన్ టన్నులకు చేరుకున్నట్టు, అంతకుముందు నెలతో పోలిస్తే 11 శాతం అధికమని పెట్రోలియం, సహ వాయువులు మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, గతేడాది ఇదే నెలతో పోలిస్తే డిమాండ్ ఇంకా 7.9 శాతం తక్కువే. ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ 9.94 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఇది 2007 నాటి కనిష్ట స్థాయి. లాక్‌డౌన్ ఆంక్షలు ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా దెబ్బతీసిన తర్వాత నుంచి ఇప్పటివరకు 64 శాతం కోలుకుంది. భారత్ మొత్తం ఇంధన వినియోగంలో రెండు వంతుల వాటా కలిగిన డీజిల్ వినియోగం గత నెలలో 3.26 మిలియన్ టన్నుల నుంచి జూన్‌లో 6.30 మిలియన్ టన్నులకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన డీజిల్ వినియోగం జూన్ నెలతో వరుసగా నాలుగవ నెలలోను 15 శాతం క్షీణతను నమోదు చేసింది. పెట్రోల్ అమ్మకాలు 13.6 శాతం తగ్గి 2.28 మిలియన్ టన్నులకు పడిపోయింది. అయితే, ఏప్రిల్‌లో నమోదైన 0.97 మిలియన్ టన్నుల కంటే ఈసారి 134 శాతం ఎక్కువ కావడం గమనార్హం.