దేశ బాధ్యతల నుంచి తండ్రి బాధ్యతలకు..

by Shyam |   ( Updated:2023-08-22 04:54:20.0  )
దేశ బాధ్యతల నుంచి తండ్రి బాధ్యతలకు..
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా శనివారం తన ట్విట్టర్ అకౌంట్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన కొడుకుకు పాలు పట్టిస్తున్న ఫొటోను షేర్ చేసి..’దేశ బాధ్యతల నుంచి తండ్రి బాధ్యతలకు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. హార్దిక్, నటాషా దంపతులకు ఈ ఏడాది జులై 30న కొడుకు అగస్త్య పుట్టాడు. తర్వాతి నెలలోనే పాండ్యా ఐపీఎల్ ఆడటానికి యూఏఈ వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి వన్డే, టీ20 సిరీస్ ఆడాడు. టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసిన పాండ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. టెస్టు సిరీస్‌లో సభ్యుడు కానందున పాండ్యా ఇండియాకు తిరిగి వచ్చాడు

ముంబయిలోని తన ఇంటికి చేరుకున్న పాండ్యా చాలా రోజుల తర్వాత తన కొడుకును చూసుకున్నాడు. అతడికి ఆప్యాయంగా పాలు పట్టిస్తూ తీసుకున్న వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దేశ బాధ్యతల తిరిగి తండ్రి బాధ్యతలు తీసుకున్నా అంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

Advertisement

Next Story