- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోపం పట్టలేక… గొంతుకోసి చంపాను
దిశ, వెబ్‌డెస్క్: కరోనాపై ఎదురొడ్డి పోరాడుతున్న ఓ వైద్యురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. ఢిల్లీలోని శివపురి కాలనీకి చెందిన డాక్టర్ యోగిత.. మొరాదాబాద్‌లోని తీర్థంకర్ మెడికల్ కాలేజీలో 2009లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, మూడేండ్ల క్రితం ఎస్ఎస్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులో చేరింది. ఆగ్రా థానాలోని ఎంఎం గేట్ నూరి దర్వాజాలో నివసించేది. మంగళవారం సాయంత్రం డాక్టర్ యోగితను కలిసేందుకు ఆమె స్నేహితులుడ డాక్టర్ వివేక్ జలాన్ నుంచి ఆగ్రా వచ్చాడు.
కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. వెంటతెచ్చుకున్న కత్తితో ఆమె గొంతును కోసేశాడు. ముఖం, తలపై కూడా కత్తితో పొడిచాడు. అనంతరం డౌకీ ప్రాంతంలోని బమ్రౌలి గ్రామానికి సమీపంలో ఉన్న నిర్జన ప్రదేశంలో యోగిత మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు, ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి సమాచారం అందించారు.
అనంతరం ఆమె స్నేహితుడు వివేక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఏడేండ్లుగా రిలేషన్లో ఉన్నామని, పెండ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో కోపం పట్టలేక చంపేసినట్టు డాక్టర్ వివేక్ చెప్పారు.