- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిట్సిపాస్‌కు ఫ్రాన్సిస్ షాక్.. తొలి రౌండ్‌లోనే ఓటమి
దిశ, స్పోర్ట్స్: గ్రాస్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ మెయిన్ డ్రా తొలి రోజే సంచలనం నమోదయ్యింది. మెన్స్ సింగిల్స్‌లో మూడో సీడ్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై వెనుదిరిగాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో నోవాక్ జకోవిచ్‌కు గట్టి పోటీ ఇచ్చిన సిట్సిపాస్ మూడు వారాలు తిరగక ముందే అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు ఫ్రాన్సిస్ టైఫో చేతిలో 4-6, 4-6, 3-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఫ్రాన్సిస్ కెరీర్‌లో ఇది అతిపెద్ద విజయం. టాఫ్ 5 ర్యాంకుల్లో ఉన్న ఆటగాడిని ఓడించడం ఫ్రాన్సిస్‌కు ఇదే తొలిసారి.
ఇక మెన్స్ సింగిల్స్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ నోవాక్ జకోవిచ్ 4-6, 6-1, 6-2, 6-2 తేడాతో అన్ సీడెడ్ ఆటగాడు జాక్ డ్రేపర్‌పై విజయం సాధించాడు. తొలి సెట్ కోల్పోయినా.. జకోవిచ్ కోలుకొని ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ 2 అరెనా సబలెంక 6-1, 6-4 తేడాతో నికోలెస్కుపై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 32వ ర్యాంకర్ అలెగ్జాండ్రోవా, 23వ ర్యాంకర్ కీస్ కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.