Technology : కీటకాల కళ్లే ప్రేరణ.. ఒక్క సెకనులో 9,120 ఫొటోలు తీయొచ్చు!

by Javid Pasha |   ( Updated:2025-04-02 12:01:10.0  )
Technology : కీటకాల కళ్లే ప్రేరణ.. ఒక్క సెకనులో 9,120 ఫొటోలు తీయొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : బయట తిరుగున్నప్పుడో, పార్కులో కూర్చున్నప్పుడో మీరు కీటకాలను గమనించే ఉంటారు. ఎంతో హుషారుగా తిరుగుతుంటాయ్. ఏదైనా ప్రమాదం సంభవించిందని గ్రహిస్తే వెంటనే అలర్ట్ అవుతాయి. ఇందుకు గల ప్రధాన కారణాల్లో ఒకటి, వాటి కళ్లు. చూడ్డానికి చిన్నవిగానే ఉన్నప్పటికీ చూపులో మాత్రం కీటకాల కళ్లు చాలా పవర్ ఫుల్. తక్కువ వెలుతురులోనూ, చీకటిలోనూ కదిలే వస్తువులను సమాంతరంగా గుర్తించగలవు. ఇవి సమయంతోపాటు ఇంటిగ్రేటింగ్ సిగ్నల్స్ ( integrating signals) ద్వారా సెన్సిటివిటీని పెంచుతాయి. అయితే ఈ బయోలాజికల్ మెకానిజం(biological mechanisms)నుంచి ప్రేరణ పొందిన కొరియన్ శాస్త్రవేత్తలు, సెకనుకు 9,120 ఫొటోలు క్యాప్చర్ చేయగల సరికొత్త కెమెరాను డెవలప్ చేశారు.

దక్షిణి కొరియాలోని కైస్ట్ (KAIST) పరిశోధనా సంస్థకు చెందిన బయో అండ్ బ్రెయిన్ ఇంజనీరింగ్‌కు చెందిన రీసెర్చర్స్ క్వాంగ్ హ్యుంగ్ లీ, కీ హన్ జియింగ్, మిన్ హెచ్.కిమ్ (School of Computing) నేతృత్వంలోని బృందం పురుగుల కళ్ల నిర్మాణాన్ని అనుకరించి ఒక సూపర్ ఫాస్ట్ అండ్ హై సెన్సిటివిటీ (Super fast and high sensitivity) కెమెరాను డెవలప్ చేసింది. ఇది చాలా తక్కువ వెలుతురులో కూడా హై క్వాలిటీ చిత్రాను తీయడంలో సహాయపడుతుంది.

నిజానికి సాధారణ హై స్పీడ్ కెమెరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి ఫాస్ట్ మోషన్ (fast motion ) సిచువేషన్‌లను బాగానే కవర్ చేసినప్పటికీ, ఫ్రేమ్‌రెట్ (Framerate) పెరిగేకొద్దీ, లైటింగ్ కలెక్షన్ టైమ్ అండ్ సెన్సిటివిటీ డిక్రీజ్ అవుతుంది.(light collection time decreases and sensitivity decreases) ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిశోధకులు పురుగుల దృష్టి ఆధారంగా మల్టిపుల్ ఆప్టికల్ ఛానెల్స్ అండ్ టైమ్ ఎలిగ్‌మెంట్ (time alignment)‌ను ఉపయోగించారు. సాధారణ సింగిల్ కెమెరా సిస్టమ్స్ కి భిన్నంగా ఈ కెమెరా వివిధ సమయాల్లో డిఫరెంట్ కాంపౌండ్ (compound) ఐ స్ట్రక్చర్ (compound-eye structure) ద్వారా వివిధ సమయాల్లో ఫ్రేమ్‌లను సమాంతరంగా క్యాప్చర్ చేస్తుంది. దీనివల్ల సిగ్నల్ టు నాయిస్ రేషియో కూడా పెరుగుతుంది.

పరిశోధకులు కొత్తగా తయారు చేసిన ఈ హై రిజల్యూషన్ బయో ఇన్‌స్పైర్డ్ కెమెరా (bio-inspired camera) సాధారణ కెమెరాలకంటే 40 రెట్లు ఎక్కువ మసకగా ఉన్న వస్తువులను సైతం క్యాప్చర్ చేస్తుంది. అంతేకాదు ఈ ఛానెల్ స్ల్పిటింగ్ (channel-splitting) టెక్నికల్ కెమెరా వేగవంతమైన క్యాప్చరింగ్ స్పీడ్‌ను అందిస్తుంది. అంటే ఒక సెకనుకు 9, 120 ఫ్రేమ్‌లు/ఫొటోలు తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తక్కువ వెలుతురులో కూడా చాలా క్లారిటీగా క్యాప్చర్ చేయగలదు. కాబట్టి ఈ కెమెరాను బయోమెడికల్ ఇమేజింగ్ అండ్ మొబైల్ డివైస్‌లలో ఉపయోగించే అవకాశాలను పరిశోధకులు పరిశీలిస్తున్నారు. 3డీ ఇమేజింగ్, సూపర్ రిజల్యూషన్ ఇమేజింగ్ కోసం కూడా దీనిని మరింత డెవలప్ చేయాలని భావిస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed