నర్సింగ్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

by Shyam |
nursing students
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎస్సీ నర్సింగ్ విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విదేశాలకు వెళ్లేందుకు నర్సులు రాసే ఐఈఎల్ టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ ), ఓఈటీ(ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్టు) పరీక్షలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ స్కిల్ డెలవప్ మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఆరు నెలల పాటు జరిగే ఆ కోచింగ్‌లో వసతి సౌకర్యాన్ని కూడా ఉచితంగా కల్పిస్తున్నట్లు స్కిల్ డెవలప్ మెంట్ కో ఆర్డినేటర్ సునిత గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బీఎస్సీ(న‌ర్సింగ్‌), జీఎన్‌ఎం నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోచింగ్ ద్వారా కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేసేలా నర్సెస్‌లలో నైపుణ్యాలను తీర్చిదిద్దుతామన్నారు. కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌తో పాటు ఆయా పరీక్షల ఫీజు, స్కాలప్ షిప్‌లను కూడా చెల్లిస్తామన్నారు. ఆరు నెలల పాటు జరిగే కోచింగ్‌లో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో వంటి వాటికి ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మంచి వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఐఈఎల్‌టీఎస్, ఓఈటీ పరీక్షలకు శిక్షణ పొందిన వారు విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు.

ఆసక్తి గల వారు 63091 64343, 63091 65353, 63091 66262 ఫోన్ నెంబర్లలో లేదా [email protected]కు ఈమెయిల్ ద్వారా సంప్రదించలని పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్ వనస్థలిపురం బాటా షోరూం కాంప్లెక్స్, 4వ అంతస్తు చిరునామలో నేరుగా కూడా సంప్రదించవచ్చని కో ఆర్డినేటర్ పేర్కొన్నారు. అర్హత కలిగి ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed