- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 నుండి ఉచిత మంచినీటి పంపిణీ: మంత్రి తలసాని
దిశ ప్రతినిధి , హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఇంటికీ 20 వేల లీటర్ల లోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈనెల 12న మంత్రి కేటీఆర్ బొరబండలో ప్రారంభిస్తారని మంత్రి తలసాని వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామి అమలులో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.
గ్రేటర్ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్‌లు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో తప్ప దేశంలో ఎక్కడా ఉచితంగా నీటిని సరఫరా చేయడంలేదని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు రూ. 10 వేలు చెల్లించామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు రూ . 25 వేలు ఇస్తామని చెప్పారనీ… కానీ నేటివరకు ఎక్కడా ఇవ్వలేదన్నారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకున్నారని విమర్శించారు.