- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. ఎల్బీనగర్‌లో ఉచితంగా..
దిశ, ఎల్బీనగర్: ప్రజలకు ఉచిత హెల్త్ క్యాంపులు ఎంతో దోహదపడుతాయని హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని హైకోర్ట్ కాలనీలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జనత దరియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ సెంటర్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉచిత హెల్త్ సెంటర్ ను డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, హాస్పిటల్స్ లో వైద్య ధరలు పెరుగుతున్న వేళ ఇటువంటి ఉచిత హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేసి తమ ఉదారతను చాటుకున్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ యజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.