కరోనా మరణాలు: నాలుగో స్థానంలో ఫ్రాన్స్

by vinod kumar |
కరోనా మరణాలు: నాలుగో స్థానంలో ఫ్రాన్స్
X

పారిస్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1.66 లక్షల మంది మృత్యువాత పడ్డారు. కరోనా మరణాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లలోనే ఎక్కువగా నమోదవుతుండగా, క్రమంగా ఫ్రాన్స్‌లోనూ పెరుగుతున్నాయి. కొవిడ్-19 కారణంగా ఫ్రాన్స్‌లో సోమవారం ఒక్క రోజే 547 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 20,265‌కు చేరింది. ఈ విషయాన్ని అక్కడి టాప్ హెల్త్ ఆఫీసర్ జెరోమ్ సలోమన్ వెల్లడించారు. దీంతో ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవించిన నాలుగో దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. కాగా, అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య 40,000 దాటింది.

Tags: france, deaths, carona, world, 4th place

Advertisement

Next Story

Most Viewed